థర్డ్ బెస్ట్ మద్యం మన దేశానిదే.. మిథున..  - MicTv.in - Telugu News
mictv telugu

థర్డ్ బెస్ట్ మద్యం మన దేశానిదే.. మిథున.. 

October 2, 2020

Mithuna World's third-finest whiskey made in India.

మద్యం ఎంత పాతదైతే ధర అంత ఎక్కవ పలుకుతుంది. పాత మద్యం మార్కెట్లో దొరకడం కష్టం. ఉన్నంతలో అత్యంత నాణ్యంగా తయారుచేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. అందుకే కంపెనీలు రాజీ లేకుండా ఉత్పత్తి సాగిస్తుంటాయి. మనదేశంలోనూ నాణ్యమైన మద్యం భారీగానే ఉత్పత్తి అవుతోంది. ప్రపంచంలో అత్యంత నాణ్యమైన మద్యాల్లో మనదేశానికి చెందిన బ్రాండుకు మూడో స్థానం దక్కింది. 

పాల్ జాన్స్ కంపెనీ తయారు చేస్తున్న సింగిల్ మాల్ట్ ‘మిథున’ బ్రాండు విస్కీకి ఈ ఘనత దక్కింది. మద్యాలకు రేటింగ్ ఇచ్చే మధువు నిపుణుడు జిమ్ ముర్రే ఈమేరకు సర్టిఫికెట్ ఇచ్చేశాడు. ‘జమ్ ముర్రేస్ విస్కీ బైబిల్ 2021’ పేరుతో వెలువరించిన నివేదికలో ఆయన ‘మిథున’ వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నాడు. దానికి ఆయన 97 పాయింట్ల ఇచ్చాడు. ముర్రే రేటింగ్ ఆధారంగా మిథునకు ఆసియన్ విస్కీ ఆఫ్ ద ఇయర్ 2021 అవార్డు కూడా వచ్చింది. కొత్త నివేదిక కోసం అతడు 4700 విస్కీలను రుచి చూశాడు. అతని రివ్యూలో Alberta Premium Cask Strength Rye తొలి ర్యాంకు, Buffalo Trace, Stagg Jr. Straight Bourbon రెండో ర్యాంకు సాధించాయి.