Home > Featured > టిక్‌టాక్‌కు పోటీగా భారతీయ యాప్.. మిత్రోన్ అరకోటి డౌన్‌లోడ్స్

టిక్‌టాక్‌కు పోటీగా భారతీయ యాప్.. మిత్రోన్ అరకోటి డౌన్‌లోడ్స్

jhg

యూత్‌లో ఇప్పుడు టిక్‌టాక్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. నటించాలనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరు స్వయంగా వీడియోలు చేస్తూ.. తమ టాలెంట్ బయటపెట్టుకుంటున్నారు. ఇలా చాలా మంది సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. ఇంతటి క్రేజ్ సంపాధించుకున్న టిక్‌టాక్‌కు పోటీగా భారత్ సరికొత్త యాప్ రూపొందించింది. ‘మిత్రోన్’ యాప్ పేరుతో వచ్చిన దీంట్లో కూడా షార్ట్ వీడియో ఫ్లాట్ ఫాం ఏర్పాటు చేసింది. దీంతో చాలా మంది యూజర్లు దీన్ని ఫాలో అవుతున్నారు.

దీన్ని రూపొందించి కేవలం నెల రోజులు మాత్రమే అవుతోంది. కానీ ఇప్పటికే 50 లక్షల మంది యూజర్లు డౌన్‌లోడు చేసుకోవడం విశేషం. ఓ వైపు చైనా బ్రాండ్‌పై వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపథ్యంలో భారతీయ బ్రాండ్‌కు మరింత కలిసి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి చాలా మంది మంచి రేటింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో దీనికి 4.7 రేటింగ్ ఉంది. అయితే కొన్నిఎన్నో లోపాలున్నాయని యూజర్లు చెబుతున్నారు. ఇంకా కొన్ని ఫీచర్స్ చేర్చాలని చెబుతున్నారు. భారతీయ యాప్ అనే అభిమానంతో డౌన్‌లోడ్ చేసుకున్నామని.. ఆకట్టుకునే ఫీచర్స్ చేర్చాలని చాలా మంది రివ్యూలు రాశారు. దీంతో ఆ దిశగా అడుగులు వేస్తే ఇక టిక్‌టాక్‌కు మన దేశంలో చెక్ పడినట్టే.

ఈ యాప్‌ను ఐఐటీ రూర్కీ విద్యార్థి శివాంక్ అగర్వాల్ రూపొందించాడు. ఇది సరిగ్గా టిక్ టాక్‌కు డూప్లికేట్ వెర్షన్‌లా తయారు చేశాడు. ప్లే చార్ట్ లో ఫ్రీ యాప్స్ జాబితాలో మిత్రోన్ 12వ స్థానంలో ఉంది. ప్రస్తుతానికి ఐవోఎస్ వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులో లేదు. ప్రధాని మోదీ ఎక్కువగా మిత్రోన్ అనే పేరును ఉచ్చరిస్తూ ఉంటారు. దీని కారణంగా కూడా బ్రాండ్ నేమ్ పెరిగే అవకాశం ఉంది. ఇటీవల మోదీ కూడా దేశీ బ్రాండ్లకు మద్దతు ఇవ్వాలని కూడా కోరిన సంగతి తెలిసిందే. మరి చైనాపై వ్యతిరేకత పెరుగుతున్న ఈ సమయంలో టిక్‌టాక్ స్థానంలో మిత్రోన్ నిలుస్తుందో.. లేదో చూడాలి.

Updated : 27 May 2020 1:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top