కరోనాపై యుద్ధానికి బుడ్డోడి సాయం.. - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాపై యుద్ధానికి బుడ్డోడి సాయం..

April 1, 2020

Mizoram boy breaks open his piggy bank to covid-19 donation

కరోనా మహమ్మారిపై యుద్దానికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, పలు కంపెనీలు, స్వచ్చంధ సంస్థలు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెల్సిందే. వృద్దులు, పిల్లలు సైతం కరోనాపై పోరుకి విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ కి చెందిన 82 ఏళ్ళ బామ్మ.. స‌ల్బా ఉస్క‌ర్ తన పెన్ష‌న్ డ‌బ్బులో నుంచి లక్ష రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ఇచ్చిన సంగతి తెల్సిందే.

తాజాగా మిజోరాం రాష్ట్రంలోని కొలసిబ్ పట్టణానికి చెందిన ఏడేళ్ల రోమెల్ అనే కుర్రాడు.. నేను సైతం అంటూ కరోనా బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. తాను చిన్నప్పటినుంచి పిగ్గీ బ్యాంకులో దాచుకున్న రూ.333లను కొలసిబ్ పట్టణంలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ టీంకి అందించాడు. ఈ విషయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జొరామ్ తంగాకు తెలియడంతో రోమెల్ ను అభినందించారు. ఈ మేరకు జొరామ్ తంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోమెల్ ఔదార్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.