అమ్మకు జేజే..ఆట మధ్యలో పాలు పట్టింది.. - Telugu News - Mic tv
mictv telugu

అమ్మకు జేజే..ఆట మధ్యలో పాలు పట్టింది..

December 10, 2019

Mizoram Volleyball Player Lalventluangi Breastfeeds Baby on Field During Interval

మాతృప్రేమ గొప్పదనాన్ని చెప్పడానికి ఎన్ని మాటలూ సరిపోవు. పసిబిడ్డ తల్లి.. ఏ పనిలో ఉన్నా తన బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె కూడా అంతే  ఓ పక్క క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మరో పక్క అమ్మ ప్రేమను చాటింది. తల్లి మనసుకు నిదర్శనంగా నిలిచింది.2019 మిజోరం రాష్ట్ర క్రీడల్లో లాల్వెంట్లువాంగీ సెర్చిప్ జిల్లా తుయికుం వాలీబాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇటీవల జరిగిన మొదటి పోటీకి ఆమె తన ఏడు నెలల బిడ్డను వెంట తీసుకొచ్చింది. ఆట మధ్యలో విరామం లభించడంతో ఆమె తన బిడ్డకు పాలిచ్చింది. 

దీనికి సంబంధించిన ఫోటోను ఆ రాష్ట్ర క్రీడా మంత్రి రాబర్ట్ రోమావియా రోయ్ట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఆమెకు సెల్యూట్ చేశారు. 2019 మిజోరం రాష్ట్ర క్రీడల మస్కట్‌‌గా ఆ ఫోటోను ఉపయోగిస్తమని తెలిపారు. అలాగే, ఆమెను రూ.10 వేలు నగదు బహుమతితో సత్కరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆమె క్రీడా స్ఫూర్తికి, అమ్మ ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సెల్యూట్ లాల్వెంట్లువాంగీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.