రాజకీయాల నుంచి తప్పుకుంటా.. స్టాలిన్ - MicTv.in - Telugu News
mictv telugu

రాజకీయాల నుంచి తప్పుకుంటా.. స్టాలిన్

May 14, 2019

తనపై వస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పొత్తు కోసం డీఎంకే తమతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ చేసిన ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు. తమిళసై చేసిన ఆరోపణలు రుజువైతే ఆమెతో పాటు, ప్రధాని మోదీ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు.

MK Stalin says BJP afraid of DMK's impending victory, dares Tamilsai to prove her remarks

పొత్తు కోసం బీజేపీతో డీఎంకే సంప్రదింపులు జరుపుతోందని తమిళసై సౌందర్ రాజన్ మీడియా ముందు చెప్పారు. బీజేపీ తప్పకుండా గెలుస్తుందని పోల్ అంచనాలు చెబుతున్నాయని అన్నారు. ఎక్కడికి వెళ్లినా బీజేపీ విజయం ఖాయం అంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

తమిళనాడులో ఇప్పటికే కాంగ్రెస్‌తో డీఎంకే పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగింది. తదుపరి దేశ ప్రధాని రాహుల్ గాంధీయేనని స్టాలిన్ రాహుల్‌కు బహిరంగంగానే మద్దతు తెలిపారు. దేశంలో తృతీయ ఫ్రంట్‌కు ఆస్కారం లేదని అన్నారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ రాదు అని ధీమా వ్యక్తం చేశారు.