MLA Akbaruddin writes letter to CM KCR to pay the honorarium to Imam, Mouzam
mictv telugu

సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ లేఖ

November 13, 2022

రాష్ట్రంలో మసీదుల్లో పనిచేసే ఇమామ్, మౌజామ్లకు గత 5 నెలలుగా గౌరవ వేతనం చెల్లించడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. బకాయిలను వెంటనే చెల్లించాలని కేసీఆర్ను కోరారు. నెలల తరబడి గౌరవ వేతనం అందక వారు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పది వేల మంది ఇమామ్లు, మౌజామ్లు మసీదుల్లో పనిచేస్తున్నారని.. ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేల గౌరవ వేతనమే వాళ్లకు ఆధారమని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గత జులైలో బడ్జెట్ కేటాయించడంతో వక్ఫ్ బోర్డు అధికారులు చెక్కులు పంపించినా.. ఆర్థికశాఖ నుంచి మాత్రం అనుమతి రావడం లేదని అక్బరుద్దీన్ లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా అర్హులైన వాళ్లందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని మరో లేఖ రాశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు సైతం సకాలంలో అందక.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందులో తెలిపారు. రాష్ట్రంలో 57 ఏళ్ల వయసు దాటిన అర్హులు వృద్ధాప్య పింఛన్కు దరఖాస్తు చేసున్నారని చెప్పారు. కానీ వారికి గుర్తింపు పత్రాలు ఇచ్చినప్పటికీ.. పింఛన్ మాత్రం ఇవ్వడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.