ఈ ఎంఎల్యే గారికి అదిరి పోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అట్లా ఇట్లా కాదు…. ఎగబడి వచ్చేటంత మందున్నరు. తనకున్న అభిమాన సందోహాన్ని చూసి ఎంఎల్యేనే షాక్ అయ్యారట. అబ్బా… అంతగా ఫాలోయింగ్ ఉన్న ఎంఎల్యే ఎవరనుకుంటున్నారా… మన తెలుగు రాష్ట్రాల్ల అయితే కాదు… మరెక్కడో..?
యుఆర్ మై ఎంఎల్ ఎ సాంగ్ గుర్తుకొచ్చిందా…. ఆ.. ఆమెనే. క్యాథరిన్ టెస్రా. ఒంగోలు జిల్లా అద్దంకి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ మోబైల్ షోరూం ప్రారంభించేందుకు వెళ్లారు క్యాథరిన్. ఆమె వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు వేల సంఖ్యలో అక్కడికి వచ్చారు. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. అయితే తనకు ఇంత అభిమానులున్న సంగతి తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేసిన క్యాథరిన్…. వేదిక మీద నుండే అభివాదం చేస్తూ గ్రూప్ సెల్ఫీ తీసుకున్నారు. అయితే సిన్మాలో నుండి జనాల మధ్యకు రావడం ఇదే తొలి సారి అని అంటున్నారు క్యాథరిన్.