नैतिकता बाबू @NitishKumar के टिकारी से प्रिय विधायक अभय कुमार सिन्हा अपनी अंतरात्मा की धुन पर थिरकते हुए! pic.twitter.com/tL1TbcCOW5
— Rashtriya Janata Dal (@RJDforIndia) October 11, 2017
చూస్తుంటే బీహార్లోని ఎమ్మెల్యేలు డ్యాన్స్ చెయ్యడంలో మంచి ప్రావిణ్యులు ఉన్నట్టున్నరు. గతంలో మీరు చాలామంది ఎమ్మెల్యేల డ్యాన్స్ చూసుంటారు. కానీ ఈఎమ్మెల్యే మాత్రం బుట్టో, నాగిని, పోల్ డ్యాన్స్ అన్నీ ఒకటేపారి కలిపి చేసిండు. జేడీ(యూ) ఎమ్మెల్యే డాన్స్ చూడండి అంటూ, ఆర్జేడీ ఒక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘మీ ఎమ్మెల్యే ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి’ అంటూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఓబహిరంగ కార్యక్రమంలో జేడీ(యూ) ఎమ్మెల్యే అభయ్కుమార్ సిన్హా, కురచ దుస్తులు వేసుకున్న ఓడాన్సర్తో ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నట్టు వీడియోలో ఉంది. అంతేకాదు సదరు మహిళను ఎమ్మెల్యే అభ్యంతరకరంగా తాకుతూ కనిపించారు. కానీ వీడియోలో ఉన్నది అభయ్ కుమార్ అవునో,కాదో ఇంకా స్పష్టం కాలేదు. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధికారిక ట్విటర్ పేజీలో ఈ వీడియో పోస్ట్ చేయడంతో బీహార్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.