వీడియో : పెళ్లి వేడుకలో అమ్మాయితో ఎమ్మెల్యే చిందులు.. చీవాట్లు - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : పెళ్లి వేడుకలో అమ్మాయితో ఎమ్మెల్యే చిందులు.. చీవాట్లు

May 16, 2022

వివాహ వేడుకకు హాజరైన ఓ ఎమ్మెల్యే అక్కడ జరుగుతున్న డ్యాన్స్ ప్రదర్శనలో పాల్గొని విమర్శల పాలయ్యారు. బీహార్ అధికార పార్టీకి చెందని గోపాల్ మండల్ అనే ఎమ్మెల్యే అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో అధిష్టానం చేత చీవాట్లు తిన్నాడు. వివరాలు.. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ పార్టీ భావల్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గోపాల్ మండల్.. తన నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామంలో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి పెళ్లి భోజనం తిని రావలసిన ఎమ్మెల్యే.. అక్కడ జరుగుతున్న డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. అమ్మాయితో ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ, డబ్బులు చల్లుతూ ఒళ్ళు మరిచి తెగ ఎంజాయ్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించి వీడియో బయటికి రావడంతో పార్టీ అధ్యక్షుడు నితీష్ కుమార్ ఆయనపై సీరియస్ అయ్యారు. ఇంకెప్పుడూ ఇలా పార్టీ పరువు తీసే పని చేయవద్దని హెచ్చరించారు. కాగా గోపాల్ మండల్ గతంలో కూడా ఇలాంటి పని చేశాడు. అయితే తన చర్యను ఎమ్మెల్యే సమర్ధించుకోవడం గమనార్హం. తాను కళాకారుడినని, కళను ఎవరూ కూడా ఆపలేరని వ్యాఖ్యానించారు. గతంలో ఓ సారి రైలులో గోపాల్ అర్ధ నగ్నంగా ప్రయాణించారు. ఆ సమయంలో తనకు మోషన్స్ వచ్చాయని, మాటిమాటికీ బాత్రూంకి వెళ్లాల్సి రావడంతో చొక్కా, ప్యాంటు విప్పేశానని తెలిపారు.