తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రైతుల కాళ్లకు నమస్కారం చేశారు. నియోజకవర్గంలో కేఎల్ఐ కాలువ పొడగింపు పనుల కోసం భూములు ఇచ్చిన రైతుల కాళ్లన ఆయన మొక్కారు. సాక్ష్యాత్తు నియోజకవర్గ ఎమ్మెల్యే.. రైతుల కాళ్లకు నమస్కారం చేయడం అక్కడున్న వారు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు.
కేఎల్ఐ కాలువ పొడగింపు పనుల కోసం అవసరమైన భూములను పలువురు రైతులు స్వచ్చంధంగా ముందుకు వచ్చి అందించారు. దీంతో వారిని ఎమ్మెల్యే బాలరాజు సన్మానించాలని భావించారు. అందుకోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేదికను సిద్ధం చేసి వారిని ఆహ్వానించారు. ముందుగా రైతులకు శాలువతో సత్కరించి అనంతరం వారి కాళ్లకు మొక్కారు. భూములు ఇచ్చినందుకు పేరుపేరునా వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
కేఎల్ఐ కాలువ పనులకు భూములు ఇచ్చిన రైతులకు రుణపడి ఉంటానని గువ్వల బాలరాజు తెలిపారు. రైతులు త్యాగంతో ఎన్నో ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు పెద్ద మొత్తంలో ప్రభుత్వం నష్ట పరిహారం ఇస్తుందని ప్రకటించారు. అదే విధంగా అచ్చంపేట పరిధిలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించనున్నట్లు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
మల్లారెడ్డికి పొగపెడుతున్నారా? అతిచేష్టలే ముంచబోతున్నాయా?
సిరిసిల్ల షాలిని కిడ్నాప్ స్టోరీ.. సినిమాను తలపించే ట్విస్టులతో పూర్తి కథనం
రంగంలోకి దిగ్విజయ్ సింగ్.. దిగొచ్చిన టీ కాంగ్రెస్ నేతలు