ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ వాదాన్ని కేసీఆర్ చంపేశారని మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజకీయ బతుకునిచ్చిన చెట్టును కేసీఆర్ నరుక్కున్నారని దుయ్యబట్టారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలగించడంతోనే ఆయన బలం పోయిందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో చంద్రబాబు రాజకీయ ప్రవేశంపై జగ్గారెడ్డి స్పందించారు. కేసీఆర్ ఏపీకి వెళుతున్నందునే.. చంద్రబాబు తెలంగాణకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. సైలెంట్‌గా ఉన్న చంద్రబాబును రాష్ట్రానికి రావడానికి ముఖ్యమంత్రి అవకాశం కల్పించారని ఆరోపించారు. చంద్రబాబు ఇకపై కేసీఆర్‌తో ఆడుకుంటారని తెలిపారు. కేసీఆర్ ఏపీలో అట్రాక్ట్ చేయలేరని.. బాబు మాత్రం ఇక్కడ రాజకీయాల్లో ప్రభావం చూపుతారని ఆయన జోస్యం చేశారు. ఇకపై తెలంగాణలో సీరియస్ రాజకీయాలు నడుస్తాయని పేర్కొన్నారు.
కేసీఆర్ సర్కార్ చాలా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చని, ఏపీలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. తమ పార్టీలో నెలకొన్న సమస్యల గురించి తాను ఏం మాట్లాడనంటూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ పంచాయతీ ఇక అయిపోయిందని, అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా జతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారని జగ్గారెడ్డి చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత మైనార్టీలకు రుణాలివ్వడం ప్రభుత్వం మర్చిపోయిందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం మైనార్టీలకు కేటాయించిన రూ. 120 కోట్లను కనీసం రూ. 1500 కోట్లకు పెంచాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టు కీలక తీర్పు
ఫైనల్స్‌లో సత్తా చాటిన తెలంగాణ బాక్సర్.. పసిడి పతకం కైవసం