పాచిపోయిన అన్నం వడ్డించారు..స్పైస్ బోర్డుపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సటైర్ - MicTv.in - Telugu News
mictv telugu

పాచిపోయిన అన్నం వడ్డించారు..స్పైస్ బోర్డుపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సటైర్

February 5, 2020

dfgbh

పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విఫలమయ్యారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. స్పైస్ బోర్డుతో కొత్తగా ఒరిగేదేమి లేదన్నారు. రైతులు బిర్యానీ అడిగితే.. పాచిపోయిన అన్నం వడ్డించినట్టుగా కేంద్ర నిర్ణయం ఉందన్నారు. పసుపు బోర్డు కోసం 1986 నుంచే పోరాటాలు సాగుతున్నాయని ఆ విషయం ఎంపీగా ఉన్న అర్వింద్‌కు కనీసం తెలియదని విమర్శించారు. పసుపు బోర్డు కోసం ఉద్యమాలు జరిగిన సమయంలో ఆయన ఎక్కడున్నారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఇప్పటికే ఆరు ఉన్నాయని కొత్తగా ఏర్పాటు చేసే బోర్డుతో పసుపు రైతులకు ఒరిగేదమి లేదని చెప్పారు. గతంలో ఎంపీగా ఉన్న కవిత బోర్డు ఏర్పాటు కోసం ఎక్కని మెట్లు లేవు, మొక్కని దేవుడు లేడని పేర్కొన్నారు. పసుపు బోర్డుపై బీజేపీ నేత రాం మాధవ్ మాయ మాటలు చెప్పారు. తెచ్చామని ఇపుడు ట్వీట్ చేస్తున్నారు.అర్వింద్ ఓ నకిలీ ఎంపీ.. నకిలీ జీఓలతో మాయ చేస్తుంటాని ఎద్దేవా చేశారు. చైతన్యవంతులైన ప్రజలు త్వరలోనే ఆయన మాయ మాటలు గుర్తించి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మాట తప్పిన అర్వింద్‌ను ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలన్నారు.