గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత సీరియస్ గా తీసుకున్నారో తెలిసిన విషయమే. ఎమ్మెల్యేని తప్పకుండా ప్రజల్లో తిరగాలన్న ఆదేశాలతో వైసిపి ఎమ్మెల్యేలు పల్లెల బాట పట్టారు. ఈ క్రమంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఓ ఎమ్మెల్యే ఏకంగా గుర్రంపై ప్రయాణించారు. అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన నియోజకవర్గంలోని ఏజెన్సీ ఏరియాలలో రోడ్డు మార్గం లేకపోవడంతో నాలుగు కిలోమీటర్ల మేర గుర్రంపై తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
రోలుగుంట మండలం శివారు ఏజెన్సీ ఆర్ల పంచాయతీకి చెందిన లోసంగి పీతురు గడ్డ, పెద్ద గరువు, గుర్రాల బైల, గడప పాలెం గ్రామాలలో గడపగడపకు కార్యక్రమంలో గుర్రంపై పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ప్రజలు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే వారికి త్వరలో కొండపై కూడా రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
ఏపీలో పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించేది ఎప్పుడంటే..
బీజేపీకి ఎదురుదెబ్బ… కొత్త పార్టీని ప్రకటించిన గాలి జనార్ధన్ రెడ్డి