ప్రతిపక్షాలపై పదునైన విమర్శలతో విరుచుకుపడే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆర్టీసీ డ్రైవర్‌గా అవతారమెత్తాడు. గుడివాడ పట్టణ ప్రధాన రహదారుల్లో పల్లె వెలుగు బస్సును నడిపి సందడి చేశారు. మంత్రి స్వయంగా బస్సును నడపడం అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
పూర్తి వివరాలు పరిశీలిస్తే.. కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో కొత్తగా ఐదు పల్లె వెలుగు బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సు ఎక్కి తానే స్వయ్యంగా స్టీరింగ్ పట్టారు. తనకున్న అనుభవంతో ప్రధాన రహదారుల్లో సునాయసంగా బస్సును డ్రైవ్ చేశారు. ప్రస్తుతం కొడాలి బస్సును డ్రైవింగ్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియలో వైరల్గా మారాయి. ఈ నూతన సర్వీసులు గుడివాడ నుంచి బంటుమిల్లి, కైకలూరు తిరగనున్నాయి. ఈ బస్సులు ఎస్ఎమ్ఈ స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద మంజూరయ్యాయి. స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద దళిత సోదరుల బస్సులను ప్రారంభించడం సంతోషంగా ఉందని కొడాలి చెప్పారు. దళిత వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు.