నమ్మారు మోసపోయారు ? - MicTv.in - Telugu News
mictv telugu

నమ్మారు మోసపోయారు ?

July 17, 2017

మోసం చేసేవాడిది తప్పా ? మోసపోయే వాడిది తప్పా ? ఈ కేసులో మాత్రం మోసపోయినవాడిదే తప్పు. ఎందుకంటే ఆయన సాదాసీదా మనిషి కాదు. అతనో ప్రజా ప్రతినిధి. ఎమ్మెల్యేగా సేవ చేస్తున్న వ్యక్తి. మంత్రి పదవి కోసం మంత్రాలను నమ్ముకోవడం అంటే తనకు ఓట్లేసిన జనాలకు మంచి చేసి కాకుండా మంతరిద్దామనే ఉద్దేశం కావచ్చు. లోకం ఎంత ‘ యోయో ’ గా డెవ్ లప్ అవుతున్నా, పాష్ కల్చర్లో పాతని పాతరేస్తున్నా, కొత్తగా జనరేషన్ ఎంత అప్ డేట్ అవుతున్నా.., మూఢ నమ్మకాలు మాత్రం ఈ మనుషులను విడిచి పోవట్లేదు. ఇంతకీ విషయమేంటంటే ఒక ఎమ్మెల్యేను ( పేరు అప్రస్తుతం ) కొందరు మోసగాళ్లు కోయ దొరల వేషంలో వచ్చి, తనకు మంత్రి పదవి వచ్చేలా క్షుద్ర పూజ చేస్తామని నమ్మ బలికి 57 లక్షల కుచ్చుటోపీ పెట్టి ఉజ్గాయించారు. మంత్రంతో మంత్రి పదవిని జోలెలో వేస్కోవచ్చని భ్రమపడిన ఎమ్మెల్యే చివరికి భంగ పడ్డాడు ? ఈ విషయాన్ని బయట చెప్పుకున్నా, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తన ఇజ్జతే పోతుందని గమనించిన ఆ ఎమ్మెల్యే తన బంధువులకు చెప్పుకొని ఏడ్చి, వారిచేత కంప్లైంట్ ఇప్పిచ్చాడు. సిసి కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు తమ కార్వాయ్ ను షురూ చేసారు. ఈ రోజుల్లో మోసగాళ్ళుకు తమ తెలివితేటలు ఉపయోగించుకొని ఎంతటి మేధావినైనా మూఢనమ్మకాలతో సూపర్ గా బురిడీ కొట్టించొచ్చని గొప్ప వేదాంతం తెలిసొస్తోంది మరి !?

ప్రజా ప్రతినిధి స్థానంలో వుండి ఇలా మూఢ నమ్మకాలను నమ్మి మోసపోవడమేంటో అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ? చదువుకోలేని వారి సంగతి అటుంచినా.. బాగా చదువుకొని సొసైటీలో మంచి పొజీషన్ లో వున్నవారు కూడా వెర్రిగా మూఢ నమ్మకాల బారినపడి అడ్డంగా మోసపోవడం చూస్తుంటే ఏడవలేక నవ్వే పరిస్థితి వాళ్ళది ? చోద్యం చూస్తున్నవారిది నవ్వీ నవ్వీ పొట్ట చెక్కలు చేస్కునే బెహెత్రీన్ సీన్ అన్నమాట ఇది ! అయినా ఆయనగారు ఎమ్మెల్యేగా ఎదిగింది ప్రజలకు సేవ చేసే కదా ? అదే సేవను ఇంకాస్త ఎక్కువ చేస్తే తప్పకుండా ఆయన మంత్రి పదవి అవుతాడు కదా ? అది ఆయనకూ ఎరుకున్న ముచ్చటే. కుంజీ ప్రజల దెగ్గరుంచుకొని ఛూ ఛూ మంతర్లతో మంత్రులు అయిపోతారనుకోవడం వెర్రి వెర్రి.., ముదిరితే కొండ వెర్రి అన్నమాట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవవరనుకుంటున్నారు ? అదిప్పటికి సస్పెన్స్.. ఎందుకంటే తన బుడుబుక్కల యవ్వారం బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డట్టున్నాడు ఆ ఎమ్మెల్యే !