ఊరు మారితే తినే ఫుడ్డు మారుద్ది ,బెడ్డు మారుద్ది ,కానీ బుద్దెలా మారుద్దిరా బ్లడీ ఫూల్. అర్ధమైంతి గదా ఎవరి గురించి డైలాగ్ చెప్పినమో,ఎవరు తల్చుకుంటే పనిమన్షుల దవుడలే గాదు,ఆఖర్కి అభిమానుల దవడలు గుడ సునాయాసంగా పల్గుల్తయో, ఎంతమందిలోనైనా, ఎవ్వలి దౌడైనా పలగ్గొట్టే సత్తా ఎవరికైతే ఉందో ఆయన గురించే , దబిడి దిబిడి హీరో శ్రీ శ్రీ శ్రీ బాలయ్య గారి గురించే.
అంతకు ముందు కాళ్లకు షూ తొందరగా వెయ్యలేదని తన అసిస్టెంట్ దవుడ పలగ్గొట్టి,అందరి ఆశీస్సులు అందుకుని, ఫుల్ పబ్లిసిటీ సంపాయించుకున్న బాలయ్య,మల్లా ఇప్పుడు సాక్షాత్తు టిడిపి కార్యకర్త, ఆయన అభిమాని దండెయ్యవోతుంటే దవుడ పలగ్గొట్టిండు.ఉపఎన్నికల సందర్బంగా నిన్న నంద్యాలలో రోడ్ షోలో పాల్గొన్న బాలయ్య రాత్రి ఓ లాడ్జిలో బసచేద్దామని వెళ్లారు.ఆ సమయంలో తన అభిమాన హీరోకు దండవేసి ఫొటో దిగాలని ఆశపడిన ఓ టీడీపీ కార్యకర్త ఉత్సాహంగా ఆయన వద్దకు వచ్చారు.కొంచెం తోపులాట జరిగింది ,దీంతో ఆగ్రహించిన ఆయన ఒక్కసారిగా ఆ కార్యకర్త దవుడ పలగ్గొట్టిండు,ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేల బాలయ్య దాడి చేసిన తీరు చూసి అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను టీడీపీ కార్యకర్తలు ఆన్లైన్లో పెట్టారు.ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో బాలకృష్ణ దురుసు ప్రవర్తనతో మరి నంద్యాల ప్రజలు,అక్కడి కార్యకర్తలు, మరీ ముఖ్యంగా ఆయన అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలె.