వరంగల్‌లో మరో కొత్త సచివాలయం.. సీఎం బర్త్‌డే నాడు ప్రారంభం!!! - Telugu News - Mic tv
mictv telugu

వరంగల్‌లో మరో కొత్త సచివాలయం.. సీఎం బర్త్‌డే నాడు ప్రారంభం!!!

February 15, 2023

sachivalayam

 

హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ సమీపంలో నిర్మించి కొత్త సచివాలయం ప్రారంభోత్సవం ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది కదా. దీనిపై మళ్లీ మనసు మార్చుకొని ఫిబ్రవరి 17నే ప్రారంభించాలనుకుంటున్నారా? అని సందేహా పడకండి. ఇప్పుడు చెప్పబోయే సచివాలయం హైదరాబాద్ లోనిది కాదు. వరంగల్ లోనిది. అవునండి వరంగల్‌లోనూ కొత్త సెక్రటేరియట్ నిర్మించారు. కాకపోతే అది నిజమైన సెక్రటేరియట్ కాదు. సచివాలయం నమునాతో ఏర్పాటు చేసిన సెట్టింగ్. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సెక్రటేరియట్‌ను ప్రారంభిస్తున్నారు.

ఈనెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా స్థానిక అజంజాహి మైదానంలో సుమారు రూ. 30 లక్షల ఖర్చుతో నూతన సెక్రటేరియట్ నమునాతో సెట్టింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఈనెల 18న శివరాత్రి ఉన్న నేపథ్యంలో పట్టణ ప్రజలు ఇక్కడే పూజలు చేసేలా మరో రూ. 30 లక్షలతో భారీ శివలింగం, భక్తులు జాగారం చేసేందుకు గాను భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తునారు. ఇవాళ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయకరావులతో కలిసి ఎమ్మెల్యే ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. సెక్రటేరియట్ నమునాతో వేసిన సెట్టింగ్ వరంగల్ తూర్పు నియోజవర్గ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది.