వినుడు వినుడు ఈ ఎమ్మెల్యే చేప కథ..! - MicTv.in - Telugu News
mictv telugu

వినుడు వినుడు ఈ ఎమ్మెల్యే చేప కథ..!

July 7, 2017

లీడర్లపైకి షూలు విసరడం,,చెప్పులు విసరడం చూశాం…కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అంతే ఇందులో ఇంట్రెస్టింగ్ ట్విస్టు ఉంది. మాట వినని అధికారిపైకి ఓ ఎమ్మెల్యే చేపను విసిరారు. చేప చేప ఏమి జరిగిదంటే…

ఇతని పేరు నితీశ్ రాణే. కాంగ్రెస్ ఎమ్మెల్యే.మహారాష్ట్ర సింధుదుర్గ్‌ జిల్లాలోని కంకావ్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రానే కొంకణ్‌ ప్రాంతంలో మత్య్సకారులతో నిర్వహించిన సమావేశానికి వచ్చారు. వారితో మాట్లాడుతుండగా ఒక్కసారిగా చేపను పక్కనే ఉన్న ఓ అధికారిపై ఎమ్మెల్యే విసిరారు. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

మత్య్సకారుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న కోపంతోనే ఇలా చేశానని ఎమ్మెల్యే నితీశ్ రాణే చెబుతున్నారు. సింధుదుర్గ్‌లో సంప్రదాయ పద్ధతుల్లో చేపలు పట్టే మత్య్సకారులు, ఆధునిక పద్ధతుల్లో చేపలు పట్టే మత్య్సకారులు ఉన్నారు. ఆధునిక పద్ధతుల్లో చేపలు పట్టే మత్య్సకారులు మిగతా మత్య్సకారులను దోచుకుంటున్నారు. వారిని చూసి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న మత్య్సకారులు కూడా అక్రమంగా చేపలు పట్టుకుని వెళ్లిపోతున్నారు. దాంతో ఎందరో మత్య్సకారులకు నష్టం వాటిల్లుతోంది. వారి సమస్యలు ఎన్నిసార్లు విన్నవించినా అధికారులుపట్టించుకోలేదని, అందుకే అధికారిపై చేప విసిరాను అని రాణే అంటున్నారు.

సరే అధికారి మాట వినలేదని చేపను విసిరావు వోకే…ఎమ్మెల్యే అని ఆ అధికారి భయపడి ఊరుకోవచ్చు..అదే సమస్యలు పట్టించుకోవడం లేదని జనం అనుకుంటే మీ పరిస్థితి ఏంటీ ఎమ్మెల్యే సాబ్ …ఏం విసురుతారో గెస్ చేయండి..