దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన BRS ఎమ్మెల్యేల ఎర కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. నిన్న ఈ కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటివరకు ఈ కేసులో దర్యాప్తు చేసిన సిట్‌ను రద్దు చేస్తూ సీబీఐకి అప్పగించింది న్యాయస్థానం. అయితే హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లేలా కనిపిస్తుంది. డివిజన్ బెంచ్‌లో ఇదే అనుభవం ఎదురైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఇటీవల ఈడీ అధికారులు రెండు రోజులు విచారించారు. విచారణ అనంతరం ఈనెల 27న మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నేడు విచారణకు హాజరు కాలేదు. ఈడీకి సంబంధంలేని కేసులో విచారణ సరికాదని తెలిపారు. అసలు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఈడీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. తనను ఇబ్బంది పెట్టడానికే ఈడీ సీబీఐ విచారణ పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపించారు. న్యాయ నిపుణుల సలహాతో ముందుకు వెళ్తానని తెలిపారు.
ఈ మేరకు ఈడీ అధికారులకు ఎమ్మెల్యే పైలట్ మెయిల్ చేసినట్టు సమాచారం. ఈ కేసులో తనను ఈడీ విచారించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రిట్ పిటీషన్ వేశారు. దీనిపై రేపు హైకోర్టు విచారించనుంది. కోర్టు తీర్పు వచ్చాకే విచారణకు హాజరయ్యే విషయంపై నిర్ణయం తీసుకుంటానని రోహిత్ రెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చారట. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే నేడు ఈడీ విచారణకు హాజరు కావడం లేదని తెలుస్తుంది. మరి ఎమ్మెల్యే మెయిల్‌పై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి :
రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి విందు.. హాజరు కాని సీఎం కేసీఆర్
జనవరి 7 నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు…అందుబాటులో ఆఫర్లు