బండి సంజయ్‌ని కలిసిన ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి - MicTv.in - Telugu News
mictv telugu

బండి సంజయ్‌ని కలిసిన ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి

November 8, 2022

MLA Raja Singh's wife met BJP state president  Bandi Sanjay

 

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై సస్పెన్షన్ వేటును తొలగించాలని అతని సతీమణి ఉషా బాయి.. బీజేపీ అధిష్ఠానాన్ని కోరింది. సోమవారం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆమె భేటీ అయ్యారు. భర్త రాజాసింగ్పై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జాతీయ నాయకత్వానికి రాజాసింగ్ ఇంతకుముందే షోకాజ్‌ నోటీసులపై వివరణ ఇచ్చారని పేర్కొన్నారు. హిందూధర్మం కోసం పాటుపడుతున్నందుకే ఈ ప్రభుత్వం కక్షపూరితంగా జైల్లో పెట్టిందని ఆమె సంజయ్‌తో ఆవేదన వెలిబుచ్చినట్లుగా సమాచారం.

MLA Raja Singh's wife met BJP state president  Bandi Sanjay

అయితే రాజాసింగ్‌ పై సస్పెన్షన్ ఎత్తివేసే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత వెనుక బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకమాండ్‌ను బండి సంజయ్ కోరారు. మునుగోడు పోలింగ్‌కు ముందే సస్పెన్షన్ ఎత్తివేయాలని భావించారు. కానీ కుదరలేదు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత వెంటనే ఉషాబాయి, బండి సంజయ్‌తో భేటీ కావడ గమనార్హం.