రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కొందరు లైంగిక ఆరోపణలు చేయిస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. స్టేషన్ ఘనపూర్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, తనపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురైన భోరున ఏడ్చారు. నియోజకవర్గంలోని కరుణపురంలో ఫాదర్ కొలంబో బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న ఆయన.. కేక్ ముందు కూర్చొని గుక్కపట్టి ఏడ్చేశారు రాజయ్య. రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై లైంగిక ఆరోపణలంటూ భావోద్వేగానికి గురయ్యారు.
తనన్ను రాజకీయంగా ఎదురుకునే దమ్ములేకనే కొందరు దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే నాపై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. తన కూతురుతో సమాన వయసున్న మహిళలను అడ్డం పెట్టుకొని.. రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు.. ఎవరెన్ని కుట్రలు చేసినా స్టేషన్ ఘనపూర్ లో 5వ సారి భారీ మెజారిటీతో గెలిచి తీరుతా అంటూ శపథం చేశారు.