వైసీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని..  చావుబతుకుల్లో.. - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని..  చావుబతుకుల్లో..

June 13, 2019

వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ కారు ఢీ కొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలోని బాపూజీ నగర్ వద్ద గురువారం అసెంబ్లీ వెళ్తున్న ఎమ్మెల్యే కారు.. బైక్‌పై వెళ్తున్న నవీన్ అనే యువకుడిని ఢీ కొట్టింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఎమ్మెల్యే బాధితుడిని పరామర్శించకుండానే.. అక్కడి నుంచి ఆటోలో ఎక్కి అసెంబ్లీకి వెళ్లిపోయారు. ఆమెతో పాటు అనుచరులు గన్ మెన్లు కూడా వెళ్లిపోయారు.

Mla Rajani Car Accident at chilakaluripet.. Young Man Serious

దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, అతణ్ణి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పరామర్శించడం బాధ్యత అని ఎమ్మెల్యే‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.