వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై రాళ్ల దాడి  - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారుపై రాళ్ల దాడి 

February 21, 2020

MLA Rajini Car In Guntur

వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై గుంటూరు జిల్లాలో రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కారుపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి. కోటప్పకొండలోని కట్టుబడివారిపాలెంలో అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే మరిది గోపినాథ్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే కారులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

శివరాత్రి పండుగ సందర్భంగా గోపినాథ్ ప్రభలను ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే కారులో ఆయన వెళ్లడంతో రజనీ ఉన్నారని అనుకొని ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే వైసీపీ కార్యకర్తలు అక్కడకు రావడంతో… ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రెండు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కాగా రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో ఎమ్మెల్యే రజనీ మరిది గోపీనాథ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కారును అడ్డుకున్నారు. దీంతో గోపీనాథ్ కోటప్పగుడికి వెళ్తున్నారనీ తెలిసి ఎంపీ అనుచరులు గోపీనాథ్ కారుపై దాడికి యత్నించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.