పెళ్లి వేదిక కూలి వైసీపీ ఎమ్మెల్యేకు గాయం - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి వేదిక కూలి వైసీపీ ఎమ్మెల్యేకు గాయం

February 29, 2020

cnb bnb

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యేకు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి ఓ వివాహానికి హాజరైన ఆయన వధూవరులను ఆశీర్వదించేందుకు వేదిక ఎక్కారు. ఆ సమయంలో వేదిక కూలి గాయపడ్డారు. కాలి పాదానికి గాయం కావడంతో ఆయనకు డాక్టర్లు కట్టుకట్టారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయనతో పాటు మరో ఆరుగురికి కూడా స్వల్పగాయాలు అయ్యాయి. ఈ ఘటనతో అంతా పెళ్లి మండపంలో కొంతసేపు గందరగోళం నెలకొంది.  

తాడేపల్లి మండలం ఉండవల్లిలోని దేవుడు మాన్యంలో వివాహానాకి వెళ్లారు. అక్కడ పెళ్లి కోసం ఏర్పాటు చేసిన మండపం ఉన్నట్లుండి కూలిపోయింది. దీంతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహా పెళ్లి కుమారుడి బంధువులు కల్పన, సామ్రాజ్యం, శరణ్య, పెళ్లి కుమారుడు తండ్రి గణపతిరెడ్డి గాయపడ్డారు. వీరందరినిప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఈ ఘటన తర్వాత వివాహ వేడుకకు ఆటంకం లేకుండా మరో వేదిక ఏర్పాటు చేసి కార్యం పూర్తి చేశారు.