నా చావుకు ఎమ్మెల్యేనే కారణం..హన్మకొండలో గొంతుకోసుకుని - MicTv.in - Telugu News
mictv telugu

నా చావుకు ఎమ్మెల్యేనే కారణం..హన్మకొండలో గొంతుకోసుకుని

June 30, 2020

hanmakonda

వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ పట్టణంలో దారుణం జరిగింది. అదాలత్ లోని అమరవీరుల స్థూపం ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. చాకుతో గొంతు కోసుకొని అక్కడే పడుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అతన్ని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

ఆ వ్యక్తిని జిల్లాలోని అలంకాని పేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లుగా గుర్తించారు. అతడి దగ్గర ఉన్న బ్యాగులో ఓ సూసైడ్ నోట్ దొరికింది. అందులో తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డే కారణమని రాసి ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎమేల్యే టికెట్ ఇవ్వకూడదని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తునట్టు ఆ సూసైడ్ నోట్ లో రాసి ఉంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ…అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.