బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ ఝలక్ ఇచ్చింది. గడువు కావాలన్న రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. టైమ్ ఇవ్వబోమని తేల్చిచెప్పింది. దీంతో రోహిత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈడీ విచారణకు హాజరుకానున్నట్లు తెలిసింది. సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలని ఇటీవల ఈడీ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి బయలుదేరిన రోహిత్ రెడ్డి.. ముందుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్‌తో భేటీ అయి.. ఈడీ నోటీసులు, న్యాయ సలహాలు, తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
ఆ తర్వాత రోహిత్ రెడ్డి పీఏ ఈడీ కార్యాలయానికి చేరుకుని గడువు కావాలని లేఖ సమర్పించారు. లేఖలో ట్రాన్సక్షన్స్ తీసుకోవడానికి తనకు సమయం సరిపోనందున ఈనెల 25 వరకు సమయం ఇవ్వాలని జనవరి మొదటి వారంలో విచారణ చేపట్టాలని రోహిత్ రెడ్డి లేఖలో కోరారు. కాగా రోహిత్ రెడ్డి రిక్వెస్ట్‌ను ఈడీ పరిగణలోకి తీసుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కావాలని ఆదేశించడంతో ఈ ఎపిసోడ్ మరింత ఉత్కంఠగా మారింది. అయితే.. రోహిత్‌రెడ్డిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి క్వశ్చన్ చేస్తారా..? వ్యాపార లావాదేవీలపైన కూడా ప్రశ్నిస్తారా..? అన్నది హాట్‌టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్లో ముసలం.. మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల గుస్సా
అదృష్టం కలిసొచ్చి రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు.. రఘునందన్ రావు