ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా

July 10, 2020

MLA Roja Gunmen Suffer With Corona

కరోనా భయం ప్రజా ప్రతినిధులు వెంటాడుతూనే ఉంది. తరుచూ నేతలు,గన్‌మెన్లు వైరస్ బారిన పడుతున్నారనే విషయం తెలిసి చాలా మంది రాజకీయ నేతల్లో టెన్షన్ రేపుతోంది. తాజాగా ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా సెగ తగిలింది. వైసీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే. రోజా భద్రతా సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ అని తేలింది. కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న అతనికి పరీక్షలు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా టెన్షన్ నెలకొంది. 

గన్‌మెన్ కరోనా బారినపడటంతో రోజా కూడా స్పందించారు. తన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. వ్యాధిబారిన పడిన వ్యక్తి గత 18 రోజులుగా విధులకు రావడం లేదని చెప్పారు. కాగా ఇటీవల ఎమ్మెల్యే ఎలాంటి మాస్క్ లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తరుచూ ప్రజల్లో తిరుగుతూ.. వైసీపీ కార్యకర్తలతో సన్నిహితంగా మెలిగారు. ఈ నేపథ్యంలో అక్కడి నేతల్లో కరోనా భయం పట్టుకుంది. కాగా ఇప్పటికే ఏపీలో 23,814 కరోనా కేసులు ఉండగా.. 277 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,383 ఉన్నాయి.