తన లవ్ స్టోరీ బయటపెట్టిన ఎమ్మెల్యే రోజా - MicTv.in - Telugu News
mictv telugu

తన లవ్ స్టోరీ బయటపెట్టిన ఎమ్మెల్యే రోజా

November 11, 2019

వైసీపీ ఎమ్మెల్యే రోజా తన లవ్ స్టోరీ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. భీమిలీ బీచ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తన భర్త సెల్వమణితో ప్రేమలో పడింది ఇక్కడే అంటూ వ్యాఖ్యానించారు. అందుకే తనకు భీమిలితో ప్రత్యేకించిన అనుబంధం ఉంటుందని చెప్పారు. 

Mla Roja.

సినిమాల్లో తన కెరీర్ మొదలైన సమయంలో చామంతి సినిమా షూటింగ్ భీమిలీ బీచ్‌లోనే జరిగిందని చెప్పారు. సుమారు సంవత్సరం పాటు జరిగిన ఈ షూటింగ్‌లో తామంతా అక్కడే ఉన్నట్టు తెలిపారు. అదే సమయంలో సెల్వమణి తనకు మొదటిసారి ప్రపోజ్ చేసినట్టు వెల్లడించారు. తన సినిమా కెరీర్ కూడా ఇక్కడే ప్రారంభం కావడం.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడటం ఎన్నడూ మర్చిపోలేనని చెప్పారు. తాజాగా భీమిలీ బీచ్‌కు రావడం వల్ల పాత స్మృతులు గుర్తుకు వస్తున్నాయని ఆమె తెలిపారు.