Home > Featured > ఓయూ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఓయూ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ శుక్రవారం బిజినెస్ మేనేజ్ మెంట్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన 82వ స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గవర్నర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. ఈ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కాగా, చదువుకుంటూనే చిన్న రాజకీయ నేతగా కెరీర్ ప్రారంభించిన సంపత్.. అనతికాలంలోనే ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. సంపత్ ప్రతిభను చూసిన కాంగ్రెస్ పార్టీ ఓ రాష్ట్రానికి పరిశీలకుడిగా నియమించింది. ఇంత బిజీగా ఉండే సంపత్ కుమార్ చదువుపై మక్కువతో పీహెచ్‌డీ పట్టా సాధించడం గమనార్హం. సమకాలీన రాజకీయ నాయకులు ఎవరూ కూడా సాధించలేని ఘనతను సాధించిన సంపత్ కుమార్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభినందించారు.

Updated : 6 Aug 2022 3:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top