MLA Santhosh supported Ek Nath Shinde in maharashtra assembly
mictv telugu

ఎమ్మెల్యే దొంగ ఏడుపు.. హ్యాండిచ్చేశాడుగా..

July 4, 2022

MLA Santhosh supported Ek Nath Shinde in maharashtra assembly

మహారాష్ట్ర రాజకీయాలు ఇటీవల పెను మార్పులకు గురైన విషయం తెలిసిందే. తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకొని సీఎంగా బాధ్యతలు కూడా తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేసి ఎమ్మెల్యేలను అసోం రాష్ట్రానికి తరలించినప్పుడు ఉద్ధవ్‌తో ఉన్న ఎమ్మెల్యే సంతోష్ భాంగార్ తన నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాడు.

అందులో ఉద్ధవ్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి జరుగుతున్న పరిణామాల పట్ల కన్నీరు కూడా పెట్టుకున్నారు. మేము మీ వెంట ఉన్నామంటూ నినాదాలు చేశాడు. అయితే సోమవారం బలపరీక్ష నిర్వహించినప్పుడు మాత్రం షిండేకు మద్ధతుగా ఓటేశాడు. దీంతో ఉద్ధవ్ వర్గం షాకయింది. ప్రజలు కూడా ఎమ్మెల్యే చేసిన పనిపట్ల అవాక్కయ్యారు. కాగా, బలపరీక్షకు ముందు రోజు రాత్రే సదరు ఎమ్మెల్యే షిండేను కలిశాడంట. అక్కడ్నుంచి గట్టి హామీ రావడంతోటే సడెన్‌గా ప్లేటు ఫిరాయించాడని తెలియవస్తోంది. కొందరేమో రాజకీయాన్ని ఈ ఎమ్మెల్యేను చూసి నేర్చుకోవాలంటూ సెటైర్లు వేస్తున్నారు.