MLA Sitakka survived the boat accident
mictv telugu

చెట్టును ఢీకొన్న పడవ.. ఎమ్మెల్యే సీతక్క సేఫ్

July 16, 2022

ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రయాణిస్తున్న పడవ శనివారానికి ప్రమాదానికి గురైంది. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆమె.. పడవలో ప్రయాణిస్తూ బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తూ వారిని పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఏటూరు నాగారం మండలం ఎలిశెట్టిపల్లి వాగులో పడవలో ప్రయాణిస్తుండగా, పడవ ఓ చెట్టుని ఢీకొట్టింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పడవ ఓ పక్కకు ఒరిగిపోయింది. దీంతో సీతక్క సిబ్బంది సహాయంతో క్షేమంగా బయటపడ్డారు.