ఎంపీ భార్యపై ఎమ్మెల్యే కొడుకు లైంగిక వేధింపులు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఎంపీ భార్యపై ఎమ్మెల్యే కొడుకు లైంగిక వేధింపులు..!

March 19, 2018

ఓ ఎమ్మెల్యే కొడుకు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేరళ ఎంపీ జోస్ మణి భార్య నిషా జోస్ సంచలన ఆరోపణలు చేశారు. ‘ద అదర్ సైడ్ ఆఫ్ లైఫ్’ పేరుతో రాసిన ఆత్మకథలో ఈమేరకు వెల్లడించారు. నిషా.. కేరళ కాంగ్రెస్(మణి) చీఫ్ కేఎం మణి కోడలు కూడా. నిందితుడు కూడా ఈ పార్టీలో పనిచేసి వ్యక్తే అని వార్తలు వస్తున్నాయి.తాను 2012లో రైల్లో వెళ్తుండగా తనతో కలసి ప్రయాణించిన రాజకీయ నేత లైంగికంగా వేధించాడని ఆమె పేర్కొంది. అయితే అతని పేరు చెప్పలేదు. ‘అతడు కామంతో నా కాలును చాలాసార్లు తాకాడు. నేను టీటీఈకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఆ కామాంధుడిపై చర్యలు తీసుకుంటే తాను ఇబ్బందుల్లో పడతానని టీటీఈ నాకు చెప్పాడు.. నిందితుడు మీ మిత్రపక్షం నేతే కనుక సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోమని నా ముఖాన ఒక ఉచిత సలహా పడేశాడు..’ అని నిషా తెలిపింది.

ఎమ్మెల్యే కొడుకు ఫిర్యాదు..

కాగా నిషా తనపైనే ఆరోపణలు చేసిందని, ఆమె చెప్పినవన్నీ అబద్ధాలని పూంజార్ స్వతంత్ర ఎమ్మెల్యే పీసీ జార్జ్‌ కొడుకు షోన్‌ జార్జ్‌ చెప్పారు. పుస్తకాన్ని ప్రచారం చేసుకోవడానికి ఆమె ఈ ఆరోపణలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెకు ధైర్యముంటే లైంగిక వేధింపులకు పాల్పడింది ఎవరో చెప్పాలన్నారు. ‘లైంగిక వేధింపుల’ ఘటన జరిగినప్పుడు షోన్ జార్జి కూడా కేరళ కాంగ్రెస్(మణి) లో పనిచేస్తున్నాడు. కేరళలో ఈ వివాదంపై రచ్చ జరుగుతోంది. లైంగిక వేధింపులకు పాల్పడింది ఎవరో

చెప్పాలని నిషాను పలువురు డిమాండ్ చేస్తున్నారు.