భర్త మిస్సయ్యాడంటూ ఎమ్మెల్యే భార్య కేసు - MicTv.in - Telugu News
mictv telugu

భర్త మిస్సయ్యాడంటూ ఎమ్మెల్యే భార్య కేసు

June 21, 2022

మహారాష్ట్రలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. శివసేన సీనియర్ మంత్రి ఏక్‌నాథ్ షిండే ఎపిసోడ్ మహా కూటమికి తలనొప్పిలా మారింది. తాజాగా ఎమ్మెల్యే అయిన తన భర్త నితిన్ దేశ్‌ముఖ్ కనిపించడం లేదని అతని భార్య మిస్సింగ్ కేసు పెట్టింది. జూన్ 20 రాత్రి 7 గంటలకు భర్తతో చివరి సారి మాట్లాడానని, తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని ఫిర్యాదులో పేర్కొంది. భర్తకు ప్రాణహాని ఉందని అనుమానంగా ఉందని ఆరోపించింది. అయితే మంత్రితో పాటు వెళ్లిన ఎమ్మెల్యేలలో నితిన్ దేశ్‌ముఖ్ కూడా ఉన్నారు. వీరంతా సూరత్‌లోని ఓ హోటల్‌లో బసచేయగా, నితిన్ దేశ్‌ముఖ్‌ అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తిరుగుబాటు చేసిన మంత్రి ఏక్ నాథ్ షిండేపై పార్టీ చర్యలు తీసుకుంది. అతడిని చీఫ్ విప్ పదవి నుంచి తొలగించింది. కాగా, సాయంత్రం మంత్రి ఏక్ నాథ్ షిండే మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌పై శరద్ పవార్ స్పందనను కోరగా, ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న మూడో కుట్రగా అభివర్ణించారు. షిండే వ్యవహారం శివసేన అంతర్గత అంశమని ఉద్దవ్ థాకరే సమస్యను పరిష్కరిస్తాడనే నమ్మకం తనకుందన్నారు.