అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. ఎందుకోసమంటే - MicTv.in - Telugu News
mictv telugu

అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. ఎందుకోసమంటే

March 28, 2022

hgh

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అధికార తృణమూల్ , విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరినొకరు కొట్టుకున్నారు. రాంపూర్‌లో ఇటీవల జరిగిన 8 మంది సజీవ దహనం ఘటనపై మొదట వాగ్వాదం జరగ్గా, కొద్దిసేపట్లోనే ఘర్షణకు దారితీసింది. రాష్ట్రంలోని శాంతి భద్రతలపై సీఎం మమతా బెనర్జీ మాట్లాడాలని బీజేపీ పట్టుబట్టడంతో వివాదం మొదలైంది. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసి, అనంతరం పిడిగుద్దుల వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో టీఎంసీ సభ్యుడు ఒకరికి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియోను బీజేపీ ఐటీ హెడ్ అమిత్ మాలవీయ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై విపక్ష నేత సవేందు అధికారి మాట్లాడుతూ.. ‘శాంతి భద్రతలపై చర్చ కోసం మేం డిమాండ్ చేస్తుంటే మాపై దాడి చేయడానికి పోలీసులను సివిల్ డ్రెస్సుల్లో అసెంబ్లీకి రప్పించారు. మా ఎమ్మెల్యేలు పదిమందిని కొట్టార’ని ఆరోపించారు. ఈ ఆరోపణలను టీఎసంసీ నేత ఫిర్హాద్ హకీమ్ ఖండించారు. కాగా, రాంపూర్‌లో ఒకే పార్టీలోని రెండు వర్గాల మధ్య జరిగిన రాజకీయ ప్రతీకార హత్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సుమారు 22 మందిని పొలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.