MLA’s daughter died due to snoring due to food stuck in her throat
mictv telugu

ప్రాణం తీసిన గురక.. గొంతులో ఆహారం ఇరుక్కొని ఎమ్మెల్యే కూతురు మృతి!

August 28, 2022

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర మౌర్య కుమార్తె పూనమ్‌ మౌర్య అనుమానస్పద రీతిలో మరణించారు. ఆమె మృతదేహాన్ని పరీక్షించిన పోస్టుమార్టం చేసిన డాక్టర్లు.. గొంతులో ఆహారం ఇరుక్కుని ఊపిరాడక ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు. దాంతో పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్ లో చోటుచేసుకుంది.

పూనమ్ 2017లో సంజయ్ మౌర్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే బుధవారం రాత్రి నిద్రపోయిన ఆమె.. గురువారం ఉదయానికి లేవ లేదు. పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్న పూనమ్‌ను సంజయ్ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు. దీంతో పోలీసులు పూనమ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. గురక కారణంగా ఆహారం శ్వాసనాళంలో ఇరుక్కుపోవడం వల్లే ఊపిరాడక ఆమె మరణించినట్లు శవపరీక్ష నివేదికలో తేలింది. కేసు తీవ్రత దృష్ట్యా శవపరీక్షను వీడియో కూడా తీశారు. అయితే ఈ కేసు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూనమ్ పోస్టుమార్టం అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో బంధువులు భోపాల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.