మోడీతో సెల్ఫీ దిగిన మన ఎమ్మెల్యేలు, ఎంపీలు - MicTv.in - Telugu News
mictv telugu

మోడీతో సెల్ఫీ దిగిన మన ఎమ్మెల్యేలు, ఎంపీలు

August 3, 2017

టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కవిత ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రధాన మంత్రిని నరేంద్ర మోదీని దేశ రాజధానిలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నిజామాబాదు జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పసుపు బోర్డును ఏర్పాటు చెయ్యాలని కోరారు. పసుపు పంట పండించే ముందు విత్తనాల విషయంలో, పండించిన పంటను కొనుగోలు విషయంలో ఎక్కడా సరైన విధానం లేదు, అలాగే పసుపుకు కనీస మద్దత్తు ధర లేదు అని. పసుపుకు ఒక ప్రత్యేక బోర్డు వుండాలని విన్నవించారు. విదేశాల నుండి పసుపును దిగుమతి చేస్కోవడం వల్ల మన రైతులకు నష్టం జరుగుతోందని, ఇలా పసుపు యొక్క సాధక బాధకాలను మోడికి వివరించి చెప్పారు. మోడీ కూడా సానుకూలంగా స్పందించారట.

‘ నిజామాబాదులోని స్పైస్ పార్కుకు 40 ఎకరాల భూమిని చూసామని చెప్పినా ఆ స్కీమ్ ను ఎత్తివేసినట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వమే ఈ పార్కు కోసం 30 కోట్ల రూపాయలను మంజూరు చేసింది గానీ కేంద్ర సర్కార్ ఏమీ చెయ్యలేక పోయిందని కాస్త నెర్వస్ అయ్యారు. పసుపుపై తప్పకుండా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా పేర్కొన్నమని ’ ఎంపీ కవిత చెప్పారు.

దానితో పాటు నిజామాబాదు జిల్లా ప్రజలు ఎదర్కుంటున్న ప్రధానమైన సమస్యలు , వాటి పరిష్కారానికి సంబంధించిన అంశాలపై ప్రధానమంత్రికి వినతి పత్రం ఇచ్చారు. ఎంపీలు కవిత, జితెందర్ రెడ్డి, నిజామాబాదు జిల్లాకు చెందిన శాసన సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మోడీతో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీలు పడ్డారు. ఇదే ఆ భేటీలో కొసమెరుపు !