తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక కలెక్టర్లుగా యువ అధికారులకు చాన్స్ వచ్చింది. ఉరిమే ఉత్సాహంతో యంగ్ కలెక్టర్లు యమ స్పీడ్ గా ఉన్నారు. జనం మెచ్చుకునేలా పనులు చేస్తున్నారు. అప్పడప్పుడు హడావుడిలో ఎమ్మెల్యేల్ని మరిచిపోతున్నారు. కాదు కాదు మరిచిపోయమని ఎమ్మెల్యేలే ఫీలవుతున్నారు. ఎవరి మాటలు ఎలా ఉన్నా యువ కలెక్టర్లు మాత్రం కొత్తగా ఎమ్మెల్యేలు వారిని ఓ ఆట ఆడేసుకుంటున్నారు.ఎందుకిలా..?
ఆ మధ్య ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఓ కలెక్టర్ పై ఫైర్ అయితే ఇప్పుడు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరో కలెక్టర్ తో వాగ్వాదానికి దిగారు. ఇవే కాదు చాలా చోట్ల కలెక్టర్లు ఎమ్మెల్యేల్ని కేర్ చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి .కానీ ఎమ్మెల్యేలే ఫోన్లు ఎత్తడం లేదని కలెక్టర్లు చెబుతున్నారు. ఇలా ఎవరికివారే యుమునా తీరే. సో ఎమ్మెల్యేస్ వర్సెస్ కలెక్టర్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న మాట కొన్నిచోట్ల.
జనగామ పట్టణ శివార్లలోని చంపక్‌హిల్స్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలిసి బస్ షెల్టర్ నిర్మాణానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి శంకుస్థాపన చేశారు. తిరిగి వెళ్లే క్రమంలో ఈ నెల 3న చంపక్‌హిల్స్‌లో జరిగిన సీడ్‌బాల్స్ బాంబింగ్ కార్యక్రమం గురించి నాకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు అని కలెక్టరును ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నిలదీశారు. దీనికి ఆమె మీకు ఐదుసార్లు ఫోన్ చేశాను. మీరు లిఫ్ట్ చేయలేదు సార్ అని ఆన్సారిచ్చారు. తనకు ఫోన్ రాలేదని,మీ కాల్ లిస్ట్ చూపించండని ఎమ్మెల్యే అడిగారు. దీంతో కలెక్టర్ శ్రీదేవసేన.. నన్నే అడుగుతారా సార్’’ అంటూ వర్షంలో తడుస్తూనే కాల్ లిస్ట్‌ను వెతికి ఎమ్మెల్యేకు చూపించే ప్రయత్నంచేశారు. ఇది చూసిన ఎంపీ జోక్యం చేసుకొని బయలుదేరుదామని చప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మొత్తానికి యువ కలెక్టర్ల పనితీరుని జనం తెగ మెచ్చుకుంటున్నారు. కానీ కొందరు ఎమ్మెల్యేలకు మాత్రం వీరి తీరు అస్సలు నచ్చడం లేదు..ఎందుకో మరి.