MLC Kadium Srihari Slams YSRTP Chief YS Sharmila
mictv telugu

ఏపీకి వెళ్లిపో షర్మిల..జగన్ జైలుకు పోతే అవకాశం వస్తుంది…

February 7, 2023

 kadium srihari fire on ys sharmila

వైఎస్సార్టీపీ(ysrtp) అధ్యక్షురాలు షర్మిలపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాకుండా ఏపీలో రాజకీయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ బడ్జెట్ ఉద్దేశించి షర్మిల్ చేసిన విమర్శలపై కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. “వైఎస్ కుటుంబం తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకమే. సమైకాంధ్ర నినాదంతో కోసం ప్రతీ గ్రామంలోను షర్మిల తిరిగారు. జగన్ జైలులో ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చాక షర్మిలకు జగన్ అన్యాయం చేశారు. ఆంధ్రాకు వెళ్లి షర్మిల మొరపెట్టుకోవాలి. రేపో మాపో జగన్ జైలుకు పోతే మీకు అవకాశం వస్తుంది. తెలంగాణలో తిరిగి సమయం వృథా చేసుకోవద్దు. బడ్జెట్ పై ఆమె మాట్లాడటం బాధాకరం ” అని కడియం వ్యాఖ్యానించారు.

షర్మిల ఏమన్నారంటే..

తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన షర్మిల పాదయాత్ర ప్రస్తుతం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఆమె ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వాన్ని పలు అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం విడుదల చేసిన బడ్జెట్‌పై కూడా షర్మిల సెటైర్లు వేశారు. ‘‘మంత్రి హరీశ్ రావు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకొని ఫామ్ హౌజ్‎కి వెళ్లారు. అందులో ఆయన మామ పాత సారా పోశారు’’ అంటూ షర్మిల ఎద్దేవా చేసారు. గతేడాది బడ్జెట్‎ను కాపీ పేస్ట్ చేశారని, ఈ ఏడాది కేటాయింపులకు న్యాయం చేస్తారని గ్యారెంటీ ఉందా? అని ప్రశ్నించారు. షర్మిల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి : 

కోటంరెడ్డిని బెదిరించిన బోరుగడ్డ అనిల్ కార్యాలయానికి నిప్పు..

త్వరలో విశాఖకు సీఎం జగన్ షిఫ్ట్..బీచ్ రోడ్డులో ఇల్లు ?