MLC Kavita wrote a letter to CJI
mictv telugu

న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగించండి.. సీజేఐకి కవిత లేఖ

August 19, 2022

MLC Kavita wrote a letter to CJI

వివాదాస్పదమైన బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసు నిందితుల విడుదలపై రోజురోజుకీ విమర్శలు ఎక్కువవుతున్నాయి. వారికి సన్మానం చేయడం, స్వీట్లు చేయడం, సంబరాలు చేయడం సంచలనంగా మారగా, వారి చర్యను సమర్ధిస్తూ గోద్రా ఎమ్మెల్యే మాట్లాడడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

అత్యాచారం జరిగినప్పుడు బిల్కిస్ వయసు 21 అనీ, అప్పుడు ఆమె ఐదు నెలల గర్భవతి అని గుర్తు చేశారు. దోషుల విడుదలపై స్పందించాలని, దేశంలో న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు రాసిన లేఖను ట్విట్టర్‌ ద్వారా బయటపెట్టారు. అంతకుముందు కేటీఆర్ కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. అయితే జూబ్లీహిల్స్ రేప్ కేసు నిందితుల బెయిల్‌పై నెటిజన్లు ఆయనను ట్రోల్ చేయగా, ఆయన వివరణ ఇచ్చారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని జీవితాంతం జైలులోనే ఉండేలా శిక్ష విధించాలని, అందుకు అనుగుణంగా చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నిందితులు చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని బెయిల్ తెచ్చుకున్నారని, ఇలాంటి పరిస్థితి దేశంలో ఉండవద్దని తన అభిప్రాయమని స్పష్టం చేశారు.