MLC Kavitha Claims BJP Approached Her With "Shinde Model"
mictv telugu

తెరపైకి “షిండే మోడల్ “

November 18, 2022

తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. ప్రపోజల్ రాజకీయాలు ప్రకంపం సృష్టిస్తున్నాయి. టీఆర్ఎస్-బీజేపీ మధ్య హై ఓల్టేజ్ వార్‌కు తెరతీశాయి.ఎమ్మెల్సీ కవితకు షిండే మోడల్ ప్రపోజల్ చేసిందెవరు?అసలు కవిత కాదు కేసీఆర్ వచ్చినా పార్టీలో చేర్చుకోబోమని బీజేపీ నేతలు తేల్చిచెబుతున్నారు. మరి ప్రపోజల్స్ పెడుతున్నదెవరు?ఇందులో వాస్తవమెంత?ఎవరి వాదనలో నిజమెంత?

సరిగ్గా రెండురోజుల తర్వాత…

ఎమ్మెల్సీ కవితను పార్టీ మారామని బీజేపీ ఒత్తిడి చేసిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. రెండురోజుల క్రితం టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. దీనిపై తెలంగాణ బీజేపీ స్పందించింది. కవిత, కేటీఆర్ కాదు కేసీఆర్ వచ్చినా బీజేపీలో చేర్చకోబోమని బండి సంజయ్ తేల్చిచెప్పారు. కేసీఆర్ మాట్లాడిందంతా అబద్ధమని కొట్టిపారేశారు. సరిగ్గా రెండు రోజుల తర్వాత ఎమ్మెల్సీ కేసీఆర్ మాటలనే గుర్తు చేశారు. ఇంకొంచెం వివరంగా ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశారు. “బీజేపీకి చెందిన కొందరు నన్ను అప్రోచ్ అయ్యారు. నా ముందు షిండేమోడల్ ప్రతిపాదన ఉంచారు. బీజేపీలో చేరామని అడిగారు. నేను వారి ప్రపోజల్ ని తిరస్కరించా. తెలంగాణ ప్రజలు , పార్టీలు మోసం చేసే రకం కాదని చెప్పా. మా బలమెంటో మాకు తెలుసు ..స్వయంగా లీడర్లుగా ఎదుగుతాం. దొడ్డి దారులు వెతకడం అవసరం లేదు” అని కవిత అన్నారు.

షిండే మోడల్ అంటే

మహారాష్ట్రలో శివసేన రెండుగా చీలింది. ఏక్‌నాథ్ షిండేని బీజేపీ వెనుక ఉండి నడిపించింది. ఉద్దవ్ సర్కార్ దిగిపోయేలా చేసింది. ఆ తర్వాత షిండేకు బీజేపీ మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేనను చీల్చిన ఏక్ నాథ్ షిండే మహా ముఖ్యమంత్రి అయ్యారు. అచ్చం ఇలాంటి ప్రపోజలే కవిత ముందు బీజేపీకి చెందిన కొందరు పెట్టారని ఆరోపణలు వచ్చాయి.

బీజేపీ వెర్షన్

ఇదంతా నిజం కాదు. ఎవరి ముందు ప్రపోజల్ పెట్టాల్సిన అవసరం మాకు లేదు..అని బీజేపీ నేతలు అంటున్నారు. కేసీఆర్ వచ్చినా పార్టీలో చేర్చుకోబోమని బండి సంజయ్ చెప్పారు. కవిత కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేశారని ఎంపీ అర్వింద్ అన్నారు. ఈ ఆరోపణల్ని కవిత ఖండించారు. ఏ పార్టీలో చేరాల్సిన అవసరం తమకు లేదన్నారు. త్వరలో టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారబోతోంది, నేషనల్ లెవల్లో మేమే పనిచేస్తామని కవిత కౌంటర్ ఇచ్చారు.

అక్కడి నుంచి మొదలైంది…

ఫామ్‌హౌజ్ ఎపిసోడ్ తర్వాత తెలంగాణ రాజకీయం విచిత్ర మలుపులు తిరుగతుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ తరఫున కొందరు ప్రయత్నాలు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు హైకోర్టులో ఉంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సిట్ వేసింది. ఇక అప్పటి నుంచి ప్రపోజల్ రాజకీయాలు ఊపందుకున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కామెంట్లు చేయడంతో వార్ రసవత్తంగా మారింది. ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.