BRS MLC Kavitha Satirical Tweet On Governor Tamilisai Soundarajan Comments
mictv telugu

తమిళిసైకి కవితక్క ఘాటు రిప్లై..

January 26, 2023

Brs mlc kalvakuntla Kavitha satirical tweet on Telangana governor tamilisai soundarajan comment on kcr farm house

రిపబ్లిక్ డే ప్రసంగంలో సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ‘ఫామ్ హౌస్, హౌసెస్’ అంటూ తమిళిసై పరోక్షంగా సీఎంను విమర్శించడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా ట్వీట్ చేశారు. ‘‘కరోనా సంక్షోభ సమయంలో సెంట్రల్ విస్టా(పార్లమెంటు) కంటే దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేం డిమాండ్ చేశాం. కొందరి సంపదను పెంచడంపై కాకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగుల సంక్షేమం కోసమే మేం పోరాడుతున్నాం. కేసీఆర్ గారి దార్శినికతనే ఎలుగెత్తినందుకు ధన్యవాదాలు’’ అని వ్యంగాస్త్రం సంధించారు.

 

గవర్నర్ తన ప్రసంగంలో బిల్డింగులు, ఫామ్ హౌసుల ప్రస్తావన తీసుకురావడంతో కవిత పైవిధంగా స్పందించారు. గవర్నర్ రిపబ్లక్ డే వేడుకల్లో మాట్లాడుతూ, ‘‘కొందరికి ఫామ్ హౌసులు ఉండటం కాదు అందరికీ నివసించడానికి ఇళ్లు ఉండాలి. అభివృద్ధి అంటే కొత్త బిల్డింగులు కట్టడం కాదని దేశ నిర్మాణం’’ అని కొత్త సచివాలయాన్ని ఉద్దేశించి అన్నారు. రాజ్ భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకులకు కేసీఆర్ వెళ్లకపోవడంపై తమిళిసై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

భారత్‌కు పాక్ ప్రధాని.. దాదాపు 12 ఏండ్ల తర్వాత..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. నెల నెలా భత్యం