MLC Kavitha Vs MP Arvind.What Next?
mictv telugu

అర్వింద్ వర్సెస్ కవిత..ఏం జరుగుతోంది ఇక్కడ?

November 18, 2022

సీఎం కేసీఆర్ రాజేశారు. ఎంపీ అర్వింద్ ఆరోపణలు చేశారు.ఎమ్మెల్సీ కవిత కన్నెర్ర చేశారు.టీఆర్ఎస్ కార్యకర్తలు అర్వింద్ ఇంటిపై దాడి చేశారు.అసలు అర్వింద్ ఏమన్నారు?కవిత ఎందుకిలా రియాక్ట అయ్యారు?గులాబీ కార్యకర్తల గుస్సాకు కారణాలేంటి?మార్పు మంటలు తెలంగాణ రాజకీయాల్ని మలుపుతిప్పుతాయా?

రచ్చ మొదలైంది…

ఎమ్మెల్సీ కవితనే పార్టీ మారమన్నారని బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపణలు చేశారు. ఎంత ధైర్యం ఉంటే తమ బిడ్డనే పార్టీ మారమాంటారా అని విరుచుకుపడ్డారు. దీనికి బీజేపీ ఎంపీ అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ మారమన్నది మేం కాదని స్పష్టం చేశారు”కవిత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆఫీసుకు ఫోన్ చేశారు. పార్టీ మారుతానని చెప్పారు. ఖర్గే ఆఫీసు నుంచి నాకు కాల్ వచ్చింది. మీ దోస్త్ ఆఫీసకొచ్చింది..కాంగ్రెస్‌లోకి వస్తానంటోంది..అని అతను చెప్పాడు. దీనికి నేను అంతా ఒట్టిదే. అంతా వాళ్ల అయ్యను భయపెట్టడానికి చేస్తుంది అని చెప్పా. అసలు జరిగింది ఇది” అని అర్వింద్ మీడియాతో చెప్పారు

కవిత కన్నెర్ర

అర్వింద్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. “నేను ఖర్గేతో మాట్లాడి కాంగ్రెస్‌లో చేరుతానని చెప్పానా?అర్విందే కాంగ్రెస్ వాళ్లతో టచ్‌లో ఉన్నారు. షిండే నన్ను బీజేపీలో చేరమని అడిగారు. అర్వింద్..నా గురించి పిచ్చి పిచ్చగా మాట్లాడొద్దు. చిల్లర మాటలు మాట్లాడొద్దు. లేనిపోని మాటలు మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా.అనసరంగా రెచ్చగొడితే కొట్టి కొట్టి చంపుతాం. నకిలీ సర్టిఫికెట్లతో ఎన్నికల్లో పోటీ చేశావు. నీ డిగ్రీలపై ఈసీకి కంప్లయింట్ చేస్తా.పసుపు బోర్డు తేస్తానని నిజామాబాద్ రైతుల్ని మోసం చేశారు”అని కవిత మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ కేసులో పదేపదే తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఈడీ కేసులుని బెదిరిస్తున్నాని కవిత అన్నారు. ఇలా కవిత ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుండగానే హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో అర్వింద్ ఇంటిపై దాడి జరిగింది.

అర్వింద్ ఇంటిపై దాడి

బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇంట్లోకి దూసుకెళ్లి ఫర్నీచర్ ని ధ్వంసం చేశారు. ఇంటి అద్దాల్ని పగులగొట్టారు. దాడికి దిగిన వాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడిని బీజేపీ నేతలు బండి సంజయ్ , డీకే అరుణలు ఖండించారు. మాట్లాడే దమ్ములేకనే దాడులకు దిగుతున్నారని బండి సంజయ్ అన్నారు. ప్రజలే టీఆర్ఎస్ గూండాలకు బుద్ధి చెబుతారని బండి అన్నారు.

రచ్చ ఎందాకా

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ సైలెంట్ గా ఉంది.ప్రధాని మోదీ రామగుండ పర్యటన ప్రశాంతంగాను ముగిసింది. సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా మోదీ ఘాటైన విమర్శలు చేశారు. ఆ తర్వాత రామగుండం సభలో మాట్లాడారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడీ మాటల మంటలతో హీటెక్కింది. టీఆర్ఎస్ బీజేపీ మధ్య వార్ మొదలైంది. ఆరోపణలు,ప్రత్యారోపణలు అట్టుడుకుతోంది. మార్పు మంటలు ఢిల్లీని అంటుకుంటాయో లేదో చూడాలి.