MLC Palla Rajeshwar Reddy reacted to IT attacks on TRS leaders
mictv telugu

ఐటీ దాడులతో ఏమైతది జరిమానా వేస్తారు అంతేకదా.. పల్లా

November 22, 2022

MLC Palla Rajeshwar Reddy reacted to IT attacks on TRS leaders

గత కొంతకాలంగా టీఆర్ఎస్ నేతలు, మంత్రులపై ఈడీ, ఐటీ దాడులు జరగడం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడి జరిగింది. మల్లారెడ్డి నివాసం, ఆఫీసులు, బంధువుల ఇళ్లపైనా దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. ‘కేంద్రం దర్యాప్తు సంస్థలను రాజకీయమయం చేసి అధికారులను కార్యకర్తల్లా వాడుకుంటున్నారు.

దేశంలో 4 వేల మందిపై సీబీఐ, ఈడీ, ఐడీ దాడులు జరిగితే వారిలో 3,900 మంది బీజేపీలో చేరిపోయారు. అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్నవారు బీజేపీలో చేరిపోతే నీతిమంతులు అయిపోతారా? ఈ దాడులు ఇంకా జరుగుతాయి. ఏ రైడ్ చేస్తారో చేయండి. ఏ కేసు పెడతారో పెట్టనీయండి. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. ఎలా బుద్ధి చెప్పాలో వారికి తెలుసు. ఇప్పటికే గంగుల కమలాకర్, తలసానిలపై దాడులు జరిగాయి. ఇప్పుడు మల్లారెడ్డిపై జరుగుతుంది. మేం తెలంగాణ బిడ్డలం. రాష్ట్రం కోసం ఉద్యమం చేసి జైలుకు కూడా వెళ్లొచ్చాం. అదే స్పూర్తితో ఈ దాడులపై పోరాడతా’మని బీజేపీని విమర్శిస్తూ వ్యాఖ్యానించారు.