టీడీపీకి షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీకి షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా

October 28, 2020

mlc Pothula Sunitha resigns to her post

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు వేరే పార్టీల్లోకి వెళ్లిన సంగతి తెల్సిందే. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ఛైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపారు. 

రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె తెలిపారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుపడుతుందన్నారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం‌ జగన్ చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటోందన్నారు. అయితే ఆమె త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.