కాచిగూడ రైలు ప్రమాదం.. లోకో పైలట్ కాలు తొలగింపు - MicTv.in - Telugu News
mictv telugu

కాచిగూడ రైలు ప్రమాదం.. లోకో పైలట్ కాలు తొలగింపు

November 14, 2019

హైదరాబాద్‌లోని  కాచిగూడలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్‌కు చికిత్స కొనసాగిస్తున్నారు. అతని కుడికాలుకు తీవ్ర గాయం కావడంతో దాన్ని కేర్ హాస్పిటల్ వైద్యులు దాన్ని తొలగించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు వెల్లడించారు. ఇంకా అతనికి అత్యవసర చికిత్స అందించాలని పేర్కొన్నారు. 

MMTS Loco Pilot.

ఈనెల 11న ఎంఎంటీఎస్ రైలు కర్నూలు ఇంటర్ సిటీ రైలు ఢీకొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలు అయ్యాయి. ఆ సమయంలో లోకో పైలట్ చంద్రశేఖర్ ఇంజిన్‌లోనే ఇరుక్కుపోయాడు. అతి కష్టం మీద అతన్ని క్యాబిన్ నుంచి బయటకు తీశారు. తర్వాత చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. కాగా ఈ ప్రమాదంలో సిగ్నలింగ్ తప్పులేదని రైల్వే అధికారులు తెలిపారు. సిగ్నల్ ఇవ్వకుండానే లోకో పైలెట్‌ ముందుకు వెళ్లాడని పేర్కొన్నారు.   ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లోకో పైలట్ చంద్రశేఖర్ పై కేసు నమోదు చేశారు.