మీరే వెళ్తారా.. గెంటేయమంటారా.? మహారాష్ట్రలో సంచలన పోస్టర్  - MicTv.in - Telugu News
mictv telugu

మీరే వెళ్తారా.. గెంటేయమంటారా.? మహారాష్ట్రలో సంచలన పోస్టర్ 

February 4, 2020

jhc

మహారాష్ట్రలో వెలిసిన ఓ పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. బంగ్లాదేశీయులను ఉద్దేశించి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) పార్టీ నేతల చిత్రాలతో కూడిన ఈ పోస్టర్‌లో కీలక వ్యాఖ్యలు ఉన్నాయి. వెంటనే భారత్ విడిచివెళ్లిపోవాలని.. లేదంటే తామే తమ స్టైల్లో వెళ్లగొడతామని హెచ్చరించారు. రాయ్‌గఢ్‌ జిల్లాలో స్థానిక నేతలు ఆ పార్టీ చీఫ్ రాజ్‌థాక్రేతో పాటు ఆయన కుమారుడు అమిత్ ఫోటోలను కూడా ముద్రించారు. ఈ పోస్టర్లు ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారాయి. 

కాగా ఇప్పటికే ఎంఎన్ఎస్ పార్టీ కేంద్రం తెచ్చిన  పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ప్రకటించింది. బీజేపీతో కలిసి హిందుత్వ అజెండాతో ముందుకు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ సమయంలోనే ఈ పోస్టర్లు వెలుగులోకి రావడంతో బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు సాగుతున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. మహరాష్ట్రలోనూ గత కొన్ని రోజులుగా సీఏఏకు వ్యతిరేకంగా నిరసన గళాలు వస్తున్నాయి. వారికి కౌంటర్‌గా ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు.