బ్యాడ్‌లక్..  పోలీసులను కట్టేసి చావగొట్టిన దొంగలు.. - MicTv.in - Telugu News
mictv telugu

బ్యాడ్‌లక్..  పోలీసులను కట్టేసి చావగొట్టిన దొంగలు..

October 29, 2019

పోలీసుల దెబ్బలు ఎలా ఉంటాయి?  అవి అనుభవించినవారిని అడిగితే బాగా చెప్తారు. చెప్పేటప్పుడు వారి కళ్లల్లో భయం, ఒంటిమీద రోమాలు నిక్కబొడుచుకోవడం గమనించవచ్చు. అదీ పోలీస్ దెబ్బ పవర్ మరి. సాధారణంగా పోలీసులే దొంగల చమ్డాలు ఒలుస్తారు అనగా విన్నాం. కానీ అక్కడ కథ అడ్డం తిరిగింది. దొంగలు  పోలీసులకు దెబ్బల రుచి చూపించారు. మామూలుగా కాదు, చెట్టుకు కట్టేసి మరీ కొట్టారు. దొంగల దెబ్బ ఇదీ అని పోలీసులకు రుచి చూపించారు. చచ్చింది గొర్రె అనుకున్న పోలీసులు కొట్టకండి అని వారిని ఎంతగా బతిమాలుకున్నా వినిపించుకుండా ఒళ్లంతా హూనం చేసి పంపారు. ఈ ఘటన వారణాసి నగరంలోని హార్సోస్‌ ప్రాంతాల్లో చోటు చేసుకుంది. 

రాహుల్ , రాజన్ భరద్వాజ్ అనే నేరస్తులు హార్సోస్‌ గ్రామానికి వచ్చారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ఆ గ్రామానికి వెళ్లారు. పోలీసులు వస్తున్నారంటే దొంగలు ఏమైనా ఎదురెళ్లి లొంగిపోతారా.. పారిపోకుండా? వారిలో ఓ దొంగ అదేపని చేశాడు. రాహుల్‌ అక్కడి నుంచి పారిపోగా.. రాజన్ భరద్వాజ్ పోలీసులకు చిక్కాడు. దీంతో అతన్ని కారులో ఎక్కించుకుని వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న దొంగలు తమ సహచరున్ని కాపాడుకుందాం అనుకున్నారు. గ్రామస్తులను కలుపుకుని పోలీసుల కారుకు అడ్డుపడ్డారు. వాళ్ళు పోలీసులు అన్న విషయం మరిచిపోయి చితక్కొట్టారు. రాళ్లతో దాడి చేశారు. అంతటితో పోలీసుల మీద వారి కసి తీరలేదు. ఎన్నాళ్ల కసో.. పూర్తిగా తీర్చుకుందాం అనుకుని వారిని గ్రామానికి తీసుకెళ్లి తాళ్లతో చెట్టుకు కట్టేశారు. 

वाराणसी पुलिस की इतनी बेरहमी से पिटाई…दोषियों पर सख्त कार्रवाई होनी चाहिएजंसा थाना क्षेत्र के हरसोस गांव बदमाश पकड़ने गई जौनपुर पुलिस को बदमाशों के सहयोगियों ने बनाया था बंधक और पिटाई की,वीडियो हुआ वायरल

Posted by Babloo Sharma on Monday, 28 October 2019

ఇష్టమొచ్చిన రీతిని వారిని కొట్టారు. తమను వదిలేయాలని పోలీసులు బతిమాలుతున్నా వినకుండా దాడి చేశారు. దవడల మీద, కడుపులో కసిదీరా పిడిగుద్దులు గుద్దుతున్నారు. కొందరేమో తమ ఫోన్లు తీసి వీడియోలు తీస్తున్నారు. కొట్టడం అయిపోయాక తమ దొంగల మార్క్ చూపిస్తూ.. పోలీస్ అధికారుల వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను లూటీ చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఎస్‌పీ అదనపు బలగాలతో వెళ్లి గ్రామస్తులను చెదరగొట్టి పోలీసులను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించి సుమారు 12 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. రాజన్ భరద్వాజ్, రాహుల్ బంధువుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. గాయాలపాలైన పోలీసులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పాపం పోలీసోళ్లు అని నెటిజన్లు జాలి కురిపిస్తున్నారు.