ఆండ్రాయిడ్ ఫోన్లకు హ్యాకింగ్ బెడద..పొంచిఉన్న బ్యాంకింగ్ వైరస్! - MicTv.in - Telugu News
mictv telugu

ఆండ్రాయిడ్ ఫోన్లకు హ్యాకింగ్ బెడద..పొంచిఉన్న బ్యాంకింగ్ వైరస్!

May 15, 2020

pho

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగిస్తున్నారా? ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా బ్యాంకింగ్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు టెక్ నిపుణులు. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్లకు బ్యాంకింగ్ వైరస్ పొంచివుందని హెచ్చరిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లపై దాడి చేయడానికి సరికొత్త వైరస్ సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్) అనే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది.

ఇది ఈవెంట్ బాట్ అని పిలువబడే ట్రోజన్ తరహా వైరస్. ఈ వైరస్ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉన్న బ్యాంకింగ్ యాప్స్, ఇతర ఫైనాన్షియల్ యాప్స్ నుంచి సమాచారాన్ని తస్కరిస్తుంది. ఈ వైరస్ ఫోన్ లోకి ప్రవేశించాక ఫోన్ మొత్తం దాని చేతుల్లోకి వెళ్తుంది. స్క్రీన్ లాక్ పిన్ నెంబర్లను కూడా ఈ వైరస్ తెలుసుకుంటుంది. ఈ వైరస్ ప్రమాదం పొంచిఉన్న యాప్స్ ఎక్కువగా అమెరికా, యూరప్ దేశాలు కేంద్రంగా పనిచేస్తున్నాయి. దీంతో భారత్ లో ఈ వైరస్ ప్రభావం తక్కువ ఉండనుంది. కానీ, ఇక్కడి స్మార్ట్ ఫోన్ యూజర్లకు సంబంధించి కొన్నిసేవలకు కూడా విఘాతం కలిగే అవకాశం ఉంది. ఈవెంట్ బాట్ వైరస్ ఒరిజినల్ యాప్స్ ఐకాన్లను పోలిన నకిలీ యాప్ ల ద్వారా ఫోన్లలో చొరబడుతుంది. అందుకే ఆండ్రాయిడ్ యూజర్లు థర్డ్ పార్టీ యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకోవద్దని సెర్ట్ నిఫుణులు సూచిస్తున్నారు.