కాలేజీలో మొబైల్ ఫోన్స్.. సుత్తితో పగలగొట్టిన ప్రిన్సిపల్ - MicTv.in - Telugu News
mictv telugu

కాలేజీలో మొబైల్ ఫోన్స్.. సుత్తితో పగలగొట్టిన ప్రిన్సిపల్

September 14, 2019

Mobile Checking In College.

మొబైల్ ఫోన్స్ తీసుకురావొద్దని ప్రిన్సిపల్ ఎన్నిసార్లు చెప్పినా విద్యార్థులు పట్టించుకోలేదు. తన మాటను ఏ మాత్రం లెక్కచేయకుండా కాలేజీకి ఫోన్లు తీసుకుస్తూనే ఉన్నారు. వారికి ఎలాగైనా బుద్ధిచెప్పాలని భావించిన ఆ ప్రిన్సిపల్ ఒక్కసారిగా తనిఖీలు ప్రారంభించాడు. విద్యార్థుల వద్ధ ఫోన్లు దొరకడంతో అవి వారి ముందే సుత్తితో ముక్కలు ముక్కలు చేశాడు. 

కర్నాటక  షిరాడీలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఈ ఘటన జరిగింది. క్యాంపస్‌లోకి ఫోన్లు తీసుకురావడంపై ప్రిన్సిపల్ నిషేధం విధించారు. అయినా అవి పట్టించుకోకుండా విద్యార్థులు  టీచర్ల కళ్లుగప్పి రహస్యంగా వాడుతున్నారని గుర్తించారు. వెంటనే తనిఖీ నిర్వహించి వాటిని వారి ఎదుటే వాటిని సుత్తితో బద్దలుగొట్టి ధ్వంసం చేశారు.