సిద్దిపేటలో కరోనా మొబైల్ టెస్టింగ్ బస్సు  - MicTv.in - Telugu News
mictv telugu

సిద్దిపేటలో కరోనా మొబైల్ టెస్టింగ్ బస్సు 

August 13, 2020

Mobile covid testing facility in siddepet harish rao .

కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రులకు వెళ్తున్నా అక్కడి సిబ్బంది పట్టించుకోవడం లేదన్న విమర్శల నేపథ్యంలో ఇళ్ల వద్దే పరీక్షలు చేస్తే బావుంటుందని కోరుతున్నారు. ఏపీలో ఇప్పటికే మొబైల్ టెస్టింగ్ బస్సులు ఏర్పాటు చేశారు. తాజాగా సిద్దిపేటలోనూ అలాంటి బస్సు సిద్ధమైంది. మంత్రి హరీశ్ రావు రేపు(శుక్రవారం) దీన్ని ప్రారంభించనున్నారు. 

ప్రజల ముంగిట్లోనే పరీక్ష సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల చాలా ఖర్చు తగ్గనుంది. అంతేకాకుండా ఆస్పత్రుల్లో, బస్సుల్లో, ఇతర ప్రాంతాల్లో వైరస్‌తో కాంటాక్ట్ అయ్యే ముప్పు కూడా ఉండదు. తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులు ఇతర కరోనా లక్షణాలు ఉన్నవారికి ఈ టెస్టింగ్ బస్సు ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. ప్రత్యేక చొరవ తీసుకుని దీన్ని ఏర్పాటు చేసినందుకు హరీశ్ రావును ప్రజలు అభినందిస్తున్నారు.